. . . కవిత కమిషన్ లు అడగటం తో పారిశ్రామిక వేత్తలు పారి పోయారు.
. . . కల్వకుంట్ల కవిత కు పసుపు బోర్డు రావడం ఇష్టం లేనట్టుంది
. . . ఎమ్మెల్సీ కవితపై బిజెపి ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి ఫైర్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
తెలంగాణ వచ్చింది పసుపు బోర్డు రాకపోతదా అని పసుపు రైతులు కవితను ఎంపిగా గెలిపిస్తే ఆమేకు లిక్కర్ డిలీంగ్ పైన ఉన్న శ్రద పసుపు బోర్డు ఎర్పాటుపై లేదని బిజేపి మున్సిపల్ ప్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి అన్నారు. బిజేపి జిల్లా కార్యాలయంలో సోమవారం స్రవంతిరెడ్డి మీడియాతో మాట్లాడుతు… ఎమ్మెల్సీ కవిత అదివారం పసుపు బోర్డు విషయంలో ఎంపి అర్వింద్ పై చేసిన వాఖ్యలను ఖండించారు. ఆమె ఐదేళ్లు ఎంపీగా పనిచేసిన సమయంలో లిక్కర్ వ్యాపారం పై పెట్టిన దృష్టి పసుపు రైతులపై పసుపు బోర్డుపై ఏమాత్రం పెట్టలేదని విమర్శించారు. తిహరు జైలుకు కు కుడా పసుపు బోర్డు కోసం వెల్లినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. ఆస్తులు కుడ బెట్టడం అనే డైలాగ్స్ మీకు, మీనాన్నకు సెట్ అవుతాయని అన్నారు. బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాలో ఎందుకు పసుపు శుద్ధి కర్మాగారం ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. మీ హయంలో రామ్ దేవ్ బాబా లాంటి వాణ్ణి భయపెట్టిన సంస్కృతి మిదని మీరు కమిషన్ అడగటం తో పారిశ్రామిక వేత్తలు పారి పోయారు అని ఆరోపించారు. పసుపు బోర్డు తెలేవని వచ్చే ఎన్నికలలో నీవు చెల్లవని అనాడు పసుపు రైతులు కర్రు కాల్చి వాత పెట్టారు అన్నారు. మరో మారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బిజెపి పార్టీపై, తమ ఎంపీ అరవింద్ పై అనవసరపు, అసత్యపు వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ విలేఖరుల సమావేశంలో కార్పొరేటర్లు పంచర్ రెడ్డి ప్రవళిక, ఆకుల హేమలత శ్రీనివాస్, లతా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
