25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

గుర్తు తెలియని యువకుడి దారుణ హత్య

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

నిజామాబాద్ నగర శివారులో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు యువకుడిని దారుణంగా హత్య చేసి పులాంగ్ వాగులో పారవేశారు.  నగర శివారులోని గూపన్ పల్లి స్మశాన వాటిక వద్ధ గల పులాంగ్ వాగు వద్ధ గుర్తు తెలియని యువకుడి శవం ఉందని సోమవారం రూరల్ పొలీసులకు సమాచారం అందింది. సంఘటన స్ధలాన్ని నిజామాబాద్ సౌత్ రూరల్ సిఐ, స్థానిక ఎస్ఐ పరిశీలించారు. యువకుడిని ఎక్కడైన హత్య చేసి పులాంగ్ వాగులో పారవేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లేక యువకుడి డేడ్ బాడి నీటి ప్రవహంకు కోట్టుకోచ్చి ఉంటుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముందుగా హత్యకు గురైన యువకుడి అచూకి  కోసం ప్రయత్నిస్తున్నారు. మిస్సింగ్ కేసులను పరిశీలిస్తున్నారు.

More articles

Latest article