కులగణన జరిగితే వాటాల గురించి ప్రశ్నిస్తారని ఎంపి అర్వింద్ భయపడుతున్నారు

0 1,293
  • జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కులగణన చేయడం ద్వారా ఎవరి వాటా ఎంత అని తెలిస్తే తమ ఉనికికే ప్రమాదం అవుతుందని, ప్రతి ఒక్కరు తమ వాటా అడుగుతారని అరవింద్ భయపడుతున్నాడని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో అదివారం మానాల మోహన్ రెడ్డి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతు.. కుల గణన చెయ్యలా వద్దా అని బండి సంజయ్, అరవింద్ చెప్పాలని, బీసీ లో మైనారిటీలు ఎలా ఉంటారని బీజేపీ ప్రశ్నిస్తుందని, మరి మోదీ ప్రవేశ పెట్టిన ఈడబ్ల్యుఎస్ కోటలో మైనారిటీలు లేరా అని ప్రశ్నించారు. అరవింద్ వారి స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని, కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత వచ్చిందని, కుల గణన విషయంలో బీజేపీ పాత్ర ముఖ్యంగా ఎంపి యొక్క అభిప్రాయం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. జిల్లాకు అప్పుడప్పుడు వస్తూ ప్రభుత్వంపై మాట్లాడితే ఉరుకునేది లేదు అన్నారు. కాంగ్రెస్ పార్టీ కి  ఎమ్మెల్సీ అభ్యర్థి లేడు అని మాట్లాడుతున్నాడని ఇది అరవింద్ కు బుద్ధిలేని తనానికి నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి అని జిల్లా పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని, ఉపాధ్యాయ ఏమ్మెల్సీకి సంబంధించి ఉపాధ్యాయులకే వదిలేశామన్నారు. ప్రతి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని ఆయన అన్నారు. బీజేపీ అనేది ఒక జుటా బద్మాష్ పార్టీ అని, బీసీలుగా ఉన్న బీజేపీ నాయకులు బీసీ కులగణనను వ్యతిరేకిస్తున్నారని అది వాళ్ల పిచ్చితనానికి నిదర్శనం అని ఆయన అన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో కాంగ్రెస్ నేతలు కేశవేణు, నరాల రత్నాకర్, రామార్తి గోపి, ఎన్ఎస్ యూఐ అధ్యక్షులు వేణు రాజ్,  రాజ నరేంధర్ గౌడ్, జావీద్ ఆక్రం, గడుగు రోహిత్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.