25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

మోటర్ వెహికల్ సవరణ చట్టం 2019 ఎఫెక్ట్

Must read

📰 Generate e-Paper Clip

. . . తొలిరోజు 28 మందికి భారీగా జరిమానా విధింపు

. . . ఆరుగురికి జైలు శిక్ష

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసులు తొలిరోజు మోటార్ వెహికిల్ సవరణ చట్టం 2019 కింద చేసిన కేసులలో న్యాయస్థానం భారీగా జరిమానా విధింపుతో పాటు ఆరుగురికి జైలుశిక్ష విధించిందని నిజామాబాద్ ట్రాఫిక్ సిఐ పబ్బ ప్రసాద్ తెలిపారు. నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయిచైతన్య, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ ఆలీ ఆదేశాల మేరకు మంగళవారం ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా  డ్రంకెన్ డ్రైవ్ లో  పట్టుబడిన 28 మందికి 10,000 వేల జరిమానా లేదా 6 నెలల వరకు జైలు లేదా జరిమానాతో పాటు జైలు శిక్ష విధించడం జరుగుతుందన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 34 మందికి ట్రాఫిక్ పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ నూర్జాన్ ఎదుట హాజరుపర్చగా 28మందికి 2,69,000/ జరిమానా విధించినట్లు తెలిపారు. వారిలో ఆరుగురు వ్యక్తుల్లో నగరానికి చెందిన షేక్ మునీరుద్దీన్, బుయ్యవాడి సందీప్ లకు మూడు రోజుల జైలు శిక్ష విధించగా, బిల్లి కాడి శివ, అతుల్ గోపీచంద్ లకు నాలుగు రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. షేక్  హర్షద్ తండ్రి,  శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తులకు ఏడు రోజుల జైలు శిక్ష విధించడం జరిగిందని సిఐ తెలిపారు.

More articles

Latest article