26.2 C
Hyderabad
Monday, August 3, 2026

కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

. . . బిఎల్ టీయూ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్

 

ఇందూర్, బతుకమ్మ : 

 

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ విమర్శించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో గల బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బహుజన భవన, ఇతర నిర్మాణ కార్మిక సంఘం నగర కమిటీ  సమావేశంలో దండి వెంకట్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని  స్థానిక బిల్డర్స్ వేలాది మంది భవన నిర్మాణ కార్మికుల ఉపాధిని దెబ్బతిస్తూ ఇతర ప్రాంతాలకు చెందిన కార్మికులను కారు చౌకగా తెచ్చి నిర్మాణ పనులు చేయించుకుంటూ, స్థానిక భవన నిర్మాణ కార్మికుల ఉపాధిని దెబ్బతిస్తున్నారన్నారు. అనంతరం బహుజన భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం నూతన నగర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా యాటల అనిల్ కుమార్, ఉపాధ్యక్షులు జన్నెపల్లి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా వై. గోపాల్, సహాయ కార్యదర్శులుగా ఎం. అనిల్, సి. రవి, కోశాధికారి టి. విజయ్, కమిటి సభ్యులు అమ్ జాద్, ప్రవీణ్, శ్రీను,  షేక్ సుల్తాన్, విజయ్, సాయినాథ్ లు ఎన్నికయ్యారు.

More articles

Latest article