30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

తల్లీకూతురు అదృశ్యం

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన అలకుంట సుమలత, తన కూతురు నిషిత కనబడుటలేదని తండ్రి రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తల్లి,కూతురు అదృశ్యం కేసు నమోదు చేసిన ఎల్లారెడ్డిపేట ఎస్సై రాహుల్ రెడ్డి. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం కథలాపూర్ మండలం చింతకుంటకు చెందిన ఆలకుంట లక్ష్మణ్ కు తన బిడ్డ సుమలతను (23) ను ఇచ్చి 2020లో  వివాహం జరిపించారు. రాజు భార్య లక్ష్మి ఈ నెల 27న కూతురు వద్దకు వెళ్లి స్వగ్రామం అయినటువంటి గొల్లపల్లికి తీసుకొచ్చిందని, మరుసటి రోజు  ఉదయం 6 గంటలకు  తన కూతురు సుమలత, మనమరాలు నిషితను తీసుకొని చెప్పకుండా ఏటో వెళ్ళిపోయిందని తెలిపారు. బంధువుల ఇళ్లలో,చుట్టుపక్కల వారి ఇళ్ళలో వెతకగా ఆమె ఆచూకీ లభించకపోవడంతో తండ్రి రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

More articles

Latest article