- ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి నిధుల మంజూరు కోసం వినతి
ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల గౌడ కుల సంఘ సభ్యులు జిల్లా కౌన్సిల్ మెంబర్ చందుపట్ల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ పార్లమెంటు సభ్యులు,కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను శుక్రవారం ఆయన నివాసంలో కలిసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఎంతో మహిమ కలిగిన పురాతన శిథిలావస్థలో ఉన్న ఎల్లమ్మ గుడి ఆలయాన్ని తొలగించి నూతన ఎల్లమ్మ గుడి నిర్మాణం పాలరాతితో నిర్మించడం జరుగుతుందని, ఆలయ నిర్మాణానికి సుమారు రెండు కోట్ల వ్యయం అవుతుందని ఆలయ కాంపౌండ్ నిర్మాణం కొరకు ఎంపీ నిధుల నుండి 20 లక్షల రూపాయలు మంజూరు చేయాల్సిందిగా ఎంపీ బండి సంజయ్ కుమార్ ను కోరారు. స్పందించిన బండి సంజయ్ కుమార్ త్వరలోనే నిధులు మంజూరు చేస్తానని మాట ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. బండి సంజయ్ ని కలిసిన వారిలో భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డిపేట పట్టణ శాఖ అధ్యక్షులు గంట బాలకృష్ణ గౌడ్,మండల గౌడ సంఘం అధ్యక్షులు గంట కార్తీక్ గౌడ్, ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షులు పందిర్ల లింగం గౌడ్,గౌడసంఘం ఎల్లారెడ్డిపేట అధ్యక్షులు గంట దేవయ్య గౌడ్,ఉపాధ్యక్షులు చింతకింది కిషన్ గౌడ్, పందిర్ల సత్తయ్య గౌడ్,గంట అంజయ్య గౌడ్, పుల్లయ్య గారి తిరుపతి గౌడ్, చింతకింది దేవయ్య గౌడ్, నాగుల ఎల్లయ్య గౌడ్,గౌడ కుల సంఘ సభ్యులు తదితరులు ఉన్నారు.
