27.1 C
Hyderabad

అమ్మబాబోయ్ కుక్కలు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కుక్కల దాడిలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు

 

రుద్రూర్, బతుకమ్మ :

 

గ్రామాల్లో వీధికుక్కల స్వైర విహారంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రాత్రివేళల్లో రోడ్లపైకి గుంపుగుంపులుగా వచ్చి రోడ్లపై నుంచి వెళ్ళే వారిపై దాడులు చేస్తుండడంతో కుక్కలు కనబడితే చాలు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు. రుద్రూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి  కుక్కల దాడిలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆ వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బస్టాండ్ ప్రాంగణంలో, వీధులలో గుంపులు, గుంపులుగా రోడ్లపై తిరుగుతూ చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు, సైకిల్‌, ద్విచక్రవాహనదారులను వెంబడించి పరుగుపెట్టిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కల బెడద నుండి రక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

More articles

Latest article