27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

బస్టాండ్ ఆధునీకరణ పనులు చేపట్టాలి

Must read

📰 Generate e-Paper Clip

  •  మండలం మారిన.. రుద్రూర్ బస్టాండ్ దుస్థితి మారలేదు

రుద్రూర్,  బతుకమ్మ : చినుకు పడితే రుద్రూర్ బస్టాండ్ చిత్తడిగా మారి, ప్రయాణికులకు యమ గండంగా తయారవుతుందని సీపీఎం ఏరియా కార్యదర్శి నన్నేసాబ్ అన్నారు. శనివారం పార్టీ నాయకులతో కలిసి, రుద్రూర్ బస్టాండ్ ప్రాంగణం, బురదమయమైన ఆవరణ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నన్నేసాబ్ మాట్లాడుతూ.. మండలం మారిన రుద్రూర్ బస్టాండ్ గతి మారలేదన్నారు. బాన్సువాడ నియోజకవర్గం అభివృద్ధి గురించి పదే పదే మాట్లాడే మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒకసారి రుద్రూర్ బస్టాండ్ ను చూసి మాట్లాడాలన్నారు. టాయిలెట్స్, మరుగుదొడ్లు సరిగా లేవని పేర్కొన్నారు. ప్రయాణికులకు మంచినీళ్ల సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి, ఆర్ & బీ, మరియు ఆర్టీసీ అధికారులు స్పందించకపోతే ప్రజలతో కలిసి ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సాయిబాబా, రాజం, ప్రయాణికులు ఉన్నారు.

More articles

Latest article