బస్టాండ్ ఆధునీకరణ పనులు చేపట్టాలి

 మండలం మారిన.. రుద్రూర్ బస్టాండ్ దుస్థితి మారలేదు రుద్రూర్,  బతుకమ్మ : చినుకు పడితే రుద్రూర్ బస్టాండ్ చిత్తడిగా మారి, ప్రయాణికులకు యమ గండంగా తయారవుతుందని సీపీఎం ఏరియా కార్యదర్శి నన్నేసాబ్ అన్నారు. శనివారం పార్టీ నాయకులతో కలిసి, రుద్రూర్ బస్టాండ్ ప్రాంగణం, బురదమయమైన ఆవరణ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నన్నేసాబ్ మాట్లాడుతూ.. మండలం మారిన రుద్రూర్ బస్టాండ్ గతి మారలేదన్నారు. బాన్సువాడ నియోజకవర్గం అభివృద్ధి గురించి పదే పదే మాట్లాడే మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒకసారి...