24.1 C
Hyderabad
Monday, August 3, 2026

దేశవ్యాప్తంగా ఓపీ సేవలను బహిష్కరించిన మెడికవర్ హాస్పిటల్స్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నిజామాబాద్ సిటి 

కలకత్తా ట్రైనీ డాక్టర్ పై జరిగిన అఘాయిత్యానికి నిరసనగా  ఇండియన్ మెడికల్  అసోసియేషన్ పిలుపునిచ్చిన సమ్మెకు మెడికవర్ హాస్పిటల్స్ పూర్తి మద్దతునిస్తూ శనివారం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెడికవర్ ఆసుపత్రులలో ఓపీ సేవలను బహిష్కరించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు . ఈ సందర్భంగా మెడికవర్  హాస్పిటల్ ఇంచార్జి స్వామి మాట్లాడుతూ ఇలాంటి అమానవీయమైన సంఘటనతో దేశం విస్తుపోయిందన్నారు. యావత్ భారతావని దిగ్భాంతికి లోనయిందని, ఈ ఘటనకు కారకులైన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనను పూర్తిగా ఖండిస్తూ బాధితురాలికి మద్దతునిస్తూ మెడికవర్ లో ఓపీ సేవలను బహిష్కరించామన్నారు. ప్రజల  ప్రాణాలు కాపాడే ఒక డాక్టర్ కు ఇలా జరగడం దారుణాతిదారుణం .భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఈ దారుణకి ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ హెడ్ వినయ్ కుమార్, వైద్యులు యజ్ఞ, సందీప్ రావు, కృష్ణ ఆదిత్య, దత్తురాజ్,వాను హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article