27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

రిపుల్స్ పాఠశాలలో మాక్ పోలింగ్

Must read

📰 Generate e-Paper Clip

 

. . . విద్యార్థులకు ఎన్నికల ప్రక్రియపై అవగాహన

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ పట్టణంలోని రిపుల్స్ పాఠశాలలో విద్యార్థులకు ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించే ఉద్దేశంతో శనివారం మాక్ పోలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కౌన్సిలర్లు ఫెరోజ్ ఖాన్, హకీమ్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ రాజబాబు మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి బాధ్యతాయుతమైన పౌరులని అన్నారు. సమాజంలో జరిగే ప్రతి అంశంపై విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవాలని, క్రమశిక్షణతో పాటు నాణ్యమైన విద్యను అభ్యసించి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. విద్యార్థుల్లో ఎన్నికల ప్రక్రియపై ఉన్న సందేహాలు, భయాలను తొలగించేందుకు మాక్ పోలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. భవిష్యత్తులో ప్రతి విద్యార్థి బాధ్యతాయుతమైన ఓటరుగా, సమాజ అభివృద్ధికి తోడ్పడే పౌరుడిగా ఎదగాలని ఆకాంక్షించారు.ఫౌండర్, చైర్మన్ అనిల్ కుమార్ పాటిల్ విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని, విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.మాక్ పోలింగ్‌లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఎన్నికల ప్రక్రియను ప్రత్యక్షంగా అనుభవించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థినులు, విద్యార్థులు పాల్గొన్నారు.

 

Mock polling at Ripples School

More articles

Latest article