24.7 C
Hyderabad
Monday, August 3, 2026

రఘునాథ మినీట్యాంక్ బండ్ లో మాక్ డ్రిల్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని మినీ ట్యాంక్ బండ్( రఘునాథ చెరువు) లో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రమాదవశాత్తు లోతైన నీటిలో ఎవరైన చిక్కుకుంటే ఎలా కాపాడాలని ఎస్ డిఆర్ఎప్, 7 వ బెటాలియన్ సిబ్బంది, వైద్య ఆరోగ్యశాఖ, ఫిషరిస్ డిపార్ట్ మెంట్,108 అంబులెన్స్ సిబ్బంది

Mock drill at Raghunatha Minitank Bund

ఆధ్వర్యంలో సంయుక్తంగా బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో, అత్యవసర సమయంలో ప్రజలను కాపాడేందుకు అన్ని శాఖలను అప్రమత్తంగా ఉంచేందుకు మాక్ డ్రిల్ నిర్వహించినట్టు జిల్లా అగ్నిమాపక శాఖా అధికారి టి. పరమేశ్వర్ తెలిపారు. ప్రజలు అత్యవసర సేవల కోసం కంట్రోల్ రూం (ఎస్ డిఆర్ఎఫ్) పైర్ 8712699224, ఎస్ డిఆర్ఎఫ్ ఇంచార్జీ -8712699225, జిల్లా అగ్నీమాపక అధికారి 8712699141 లకు సమాచారం ఇవ్వాలని కోరారు.

Mock drill at Raghunatha Minitank Bund

More articles

Latest article