ఏర్గట్ల, బతుకమ్మ :
ఏర్గట్ల మండల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలను మండల పరిధిలోని గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. సీనియర్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే వేముల చిత్రపటం ఉన్న కేక్ కట్ చేసి, ఒకరికొకరు స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పూర్ణానందం, ఏర్గట్ల సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి, ధోంచంద సర్పంచ్ పెద్ద కాపుల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తన, పర అని భేదం లేకుండా అన్ని వర్గాల నాయకులను ప్రజలను కలుపుకుని వెళ్లి ప్రజాసేవ చేయడంలో వేముల ముందున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బట్టపూర్ సర్పంచ్ ప్రవీణ్ యాదవ్, మాజీ ఎంపీటీసీ డాక్టర్ మధు, సొసైటీ అధ్యక్షుడు బర్మ చిన్న నరసయ్య, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి బద్దం శ్రీనివాస్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు దేవుడు నరసయ్య, మాజీ సర్పంచ్ లు కటకం సాగర్ రెడ్డి, గద్దె గంగారం, మాజీ ఉపసర్పంచ్ చిలుక కిషన్, బద్దం ప్రభాకర్, గడ్డం రమేష్, కొలిప్యాక శ్రీనివాస్, ముక్కెర దేవన్న యాదవ్, పంతులు రాజేశ్వర్, బద్దం హనుమాడ్లు, ఆశిరెడ్డి హనుమంత్ రెడ్డి, ఏలూరి శ్రీనివాస్ రెడ్డి, నాగిరెడ్డి రాజేందర్, ఆకుల రాజేందర్, తుపాకుల శ్రీనివాస్ గౌడ్, లక్కం నరసయ్య, సంగేమ్ ఆనంద్, ఏలేటి బాలకిషన్, బద్దం శ్యామ్, కేశిరెడ్డి లింగారెడ్డి, జైనుద్దిన్, రోక్కెడ మోహన్, లంబడి వెంకట్రాం, గడ్డం మోహన్, కూష లింబాద్రి, కూష గంగారెడ్డి, మండల పరిధిలోని గ్రామాల బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
