. . . ఎమ్మెల్యే స్వగృహంలో ఘనంగా జన్మదిన వేడుకలు
హైదరాబాద్, బతుకమ్మ
బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం మాజీ ముఖ్యమంత్రి, బీయర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కలిశారు. తన పుట్టిన రోజు సందర్బంగా ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం కేసీఆర్ ను కలిసి ఆశీర్వాధం తీసుకొన్నారు. ఈ సందర్బంగా కేసీఆర్, ప్రశాంత్ రెడ్డికి పూల బొకేను ఇచ్చి ఆశీర్వాదించి, ఆలింగం చేసుకొన్నారు.

ప్రశాంత్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను హైదరాబాద్ లోని తన స్వగృహంలో అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి అభిమానులు వందలాదిగా వెళ్లి కేక్ లు కట్ చేయించి, పూలమాలలు వేసి, పూలబోకెలు అందజేసి, శాలువాలతో సత్కరించారు. ఒక్కొక్కరుగా ప్రశాంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
