24.1 C
Hyderabad
Monday, August 3, 2026

రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :  79 వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా  నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో  జాతీయ పతాకాన్ని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ప్రజలకు, మహిళలకు అధికారులు, అనధికారులకు  79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాత్మా గాంధీ సారధ్యంలో సాగిన భారత స్వాతంత్ర్య పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని, అహింసే అస్త్రంగా మహాసంగ్రామాన్ని గెలిచి ప్రపంచానికి కొత్త పోరాట పంథాను పరిచయం చేసిందని అన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో రైతులకు  రైతు భరోసా, రైతు బీమా, రుణమాఫీ, వంటి పథకాలను అమలు చేశామని  తెలిపారు. నియోజకవర్గం మహిళల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి గృహ జ్యోతి, చేయూత పథకం, ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ ఇల్లు, ఉచిత 200 యూనిట్ల కరెంటు వంటి పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. నిజామాబాద్ రూరల్  నియోజకవర్గంలో   ఎక్కువ సంఖ్యలో లబ్ధిదారులు ఉన్నారని అన్నారు. ఇప్పటివరకు  రూరల్ నియోజవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులు చాలా సంతోషంగా ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం 40 లక్షల నిరుపేదలకు ఉచిత రేషన్ కార్డులను పంపిణీ చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.

MLA unfurls the flag at the Rural MLA camp office

More articles

Latest article