24.7 C
Hyderabad
Monday, August 3, 2026

రచ్చ జగన్నాథ్ స్మారక ప్రతిభా పురస్కారాల ప్రదానం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో మద్నూర్ బిచ్కుంద మండలాలలో   ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉత్తమ ప్రతిభ కనబర్చిన ముగ్గురు విద్యార్థులను జుక్కల్ శాసన సభ్యులు తోట లక్ష్మీకాంతరావు చేతుల మీదుగా గోల్డ్ మెడల్, ప్రశంసాపత్రం, మెమొంటో మరియు నగదు పురస్కారం ప్రదానం చేశారు.  ఈ కార్యక్రమంలో బిచ్కుంద గ్రామ పెద్దలు మల్లికార్జున షెట్కర్,  మున్సిపల్ కమిషనర్ హయ్యూం, రచ్చ జగన్నాథ్ స్మృతి సమితి నిర్వాహకులు రచ్చ శివకాంత్, వెంకటరెడ్డి, నాగనాథ్, సీమ గంగారం సార్, సొపాన్ సార్, ధర్పల్ గంగాధర్, బొగుడ మీద సాయిలు, ఖలీల్, ఉపాధ్యాయులు మనోహర్, భూమన్న, రాజ్ కుమార్, మల్లికార్జున్, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Presentation of the Racha Jagannath Memorial Talent Awards

More articles

Latest article