రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : 79 వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో జాతీయ పతాకాన్ని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ప్రజలకు, మహిళలకు అధికారులు, అనధికారులకు 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాత్మా గాంధీ సారధ్యంలో సాగిన భారత స్వాతంత్ర్య పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని, అహింసే అస్త్రంగా మహాసంగ్రామాన్ని గెలిచి ప్రపంచానికి కొత్త పోరాట పంథాను పరిచయం...