జుక్కల్, బతుకమ్మ : మద్నూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో సోయా కొనుగోలు కేంద్రాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రారంభించారు. సోయా ధాన్యం క్వింటాలు రూ.5,328/- ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందని తెలిపారు. రైతులందరూ సోయా ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని దళారులను నమ్మి మోసపోవద్దని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు.
