29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

గవర్నర్ కు ఎమ్మెల్యే తేనీటి విందు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా మంగళవారం నిజామాబాదు అర్బన్ నియోజకవర్గనికి విచ్చేసిన త్రిపుర గవర్నర్ ఎన్.ఇంద్రసేన రెడ్డికి అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తన స్వగృహంలో తేనీటి విందు ఏర్పాటు చేశారు. అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ జిల్లా ప్రముఖులతో కలిసి గవర్నర్ కి  బొకే, శాలువాతొ ఘనంగా సత్కారించి స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే స్వగృహంలో ఏర్పాటు చేసిన తేనీటి విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో  బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోల్ల లక్ష్మి నారాయణ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు, పోతంకర్ లక్ష్మి నారాయణ, న్యాలం రాజు, బీజేపీ మండల అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు,బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

MLA tea party for Governor

More articles

Latest article