29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

హోటళ్లపై, టిఫిన్ సెంటర్లపై సివిల్ సప్లై అధికారుల దాడులు

Must read

📰 Generate e-Paper Clip

 

భిక్కనూర్, బతుకమ్మ :

 

భిక్కనూర్ మండల కేంద్రంలో హోటల్స్, టిఫిన్ సెంటర్, టీ స్టాల్ లపై శనివారం సివిల్ సప్లై అధికారులు మెరుపు దాడులు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్న ఐదు డొమెస్టిక్ సిలిండర్ లను స్వాధీనం చేసుకున్నట్లు సివిల్ సప్లై అధికారి కిష్ణయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయిల్ కంపెనీలు కమర్షియల్ సిలిండర్ సరఫరా నిలిపివేసినట్లు తెలిపారు. గృహ అవసరాలకు ఉపయోగించే డొమెస్టిక్ సిలిండర్లను కొనుగోలు చేసి వాడుకుంటున్నట్టు సమాచారం రావడంతో దాడులు చేశామన్నారు. ఇంటి అవసరాల కోసం తీసుకున్న సిలిండర్లను అనధికారికంగా హోటళ్లకు వాడుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అక్రమంగా డొమెస్టిక్ సిలిండర్ వినియోగించిన వారికి జరిమానాలు విధిస్తామని ఆయన హెచ్చరించారు.

More articles

Latest article