27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

పలు కాలనీలు పర్యటించిన ఎమ్మెల్యే పోచారం

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ, బతుకమ్మ :

 

రానున్న మున్సిపాలిటి ఎన్నికల్లో బాధ్యతతో పనిచేసే వారిని ఎన్నుకుంటే మన వార్డులు మరింత అభివృద్ధి చేసుకోవచ్చు అని ఎమ్మెల్యే పోచారం అన్నారు. గురువారం పట్టణంలోని 2వ, 14వ వార్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి , రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు పర్యటించారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో 2వ వార్డు, 14వ వార్డు ప్రజలతో గత 5 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి పనులను తెలియచేశారు. రానున్న మున్సిపాలిటి ఎన్నికల్లో బాధ్యతతో పనిచేసే వారిని ఎన్నుకుంటే మన వార్డులు మరింత అభివృద్ధి చేసుకోవచ్చు అని తెలిపారు.గతంలో బాన్సువాడ పట్టణం గ్రామపంచాయతీ నుండి మున్సిపాలిటీగా మారిన తర్వాత సుమారు 200 కోట్ల రూపాయలతో బాన్సువాడ పట్టణం అభివృద్ధి జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కృష్ణారెడ్డి, ఖాలేక్, ఎజాస్, గురు వినయ్,నార్ల సురేష్, నార్ల రవీందర్,వహబ్,దావూద్, నందకిశోర్,ఖాజీమ్,అజీమ్, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article