28.8 C
Hyderabad
Monday, August 3, 2026

మున్సిపల్ ఎన్నికల్లో బరిలో జనసేన

Must read

📰 Generate e-Paper Clip

భీంగల్‌, బతుకమ్మ :

 

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు కౌన్సిలర్ స్థానాలకు బరిలో ఉంటారని జనసేన బాల్కొండ నియోజకవర్గం కో ఆర్డినేటర్ శివసారి ఫణింద్ర తెలిపారు. శనివారం జనసేన పార్టీ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతు జనసేన రాజకీయ వ్యూహాన్ని వెల్లడించారు. మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 12 వార్డులలో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేయబోతున్నారని, ప్రజా సేవ చేయాలనే తపన, నిబద్ధత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ​ఆసక్తి కలిగిన వారు తక్షణమే భీమ్ గల్ లోని జనసేన పార్టీ ఆఫీస్ కి వచ్చి తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ​అవినీతి రహిత పాలన, స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జనసేన ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్తోందని పేర్కొన్నారు. మార్పు కోరుకునే వారు  జనసేన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని పార్టీ తరపున పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన బాల్కొండ నియోజకవర్గం  భీంగల్ మండల కో ఆర్డినేటర్ డాక్టర్ శ్రీకాంత్ రామావత్, బీ. దిలీప్, దామ నవీన్, ప్రసన్న, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article