27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రుణం మర్చిపోలేనిది

Must read

📰 Generate e-Paper Clip

 

. . . పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్

 

రుద్రూర్, బతుకమ్మ :

 

వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజుల రుణం మర్చిపోలేనిదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారి ధాన్యం కొనుగోలు పూర్తిచేసుకుని రైతుల ఖాతాల్లో డబ్బులు పడేందుకు కృషిచేసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షులు అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజానాయకుడు రైతు బాంధవులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ కృషి వల్ల రైతుల సమస్యలు పరిష్కారం అవుతున్నాయని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు రైతుల సమస్యలను తెలుసుకుంటూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం విక్రయించిన రైతులకు వెంటనే ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే విధంగా పాటుపడ్డారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నిస్సార్, నాయకులు మాజీ జడ్పిటీసి నారోజి గంగారాం, పత్తి రాము, దిశ కమిటీ మెంబర్ నడిపింటి నగేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరి చంద్రశేఖర్, గ్రామ అధ్యక్షులు పార్వతి ప్రవీణ్, షేక్ ఖాదర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article