బాన్సువాడ, బతుకమ్మ :
బాన్సువాడ ఆర్డిఓగా రవీందర్ రెడ్డి బుధవారం బాధ్యతలను చేపట్టారు. గతంలో బాన్సువాడ ఆర్డీవో గా పనిచేసిన కిరణ్ మై సంగారెడ్డి అదనపు కలెక్టర్ గా బదిలీపై వెళ్లారు. బాన్స్ వాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ను కలెక్టరేట్ లో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. అనంతరం బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్డిఓ కార్యాలయ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు.