బాన్సువాడ బతుకమ్మ : విద్యార్థినుల ప్రయాణ సమస్యను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిష్కరించారు. వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ పట్టణం నుంచి తిమ్మాపూర్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయానికి అభివృద్ధి పనుల నిమిత్తం వెళ్తున్నారు. మార్గ మధ్యలో దుర్కి శివారులో గల ఎస్ఆర్ఎన్ కే డిగ్రీ కళాశాల వద్ద బాన్సువాడ – నిజామాబాద్ ప్రధాన రహదారిపై బాన్సువాడ వైపు వెళ్లవలసిన బస్సు కోసం నిలబడి ఉన్న విద్యార్థినులను గమనించారు. తక్షణమే కారుని ఆపి ఎందుకు విద్యార్థినులు రహదారిపై నిలబడి ఉన్నారని ప్రశ్నించారు. బస్సులు సమయానికి రాకపోవడంతో వచ్చిన పూర్తిగా నిండి ఉన్న బస్సులు రావడంతో ఆపడంలేదని విద్యార్థినులు పోచారం శ్రీనివాస్ రెడ్డికి తెలిపారు.వెంటనే స్పందించిన ఎమ్మెల్యే పోచారం బాన్సువాడ డిపో మేనేజర్ రవి కుమార్ తో ఫోన్ లో మాట్లాడారు. ఉదయం, సాయంత్రం ఎస్ఆర్ఎన్ కే కాలేజీ నుంచి నుండి బాన్సువాడ వరకు విద్యార్థినులకోసమే ప్రత్యేకంగా బస్సు సర్వీసును నడపాలని డిపో మేనేజర్ కు సూచించారు. తమ ప్రయాణ ఇబ్బందులను పరిష్కరించిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి విద్యార్థినులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
