విద్యార్థినుల ప్రయాణ సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే పోచారం

బాన్సువాడ బతుకమ్మ : విద్యార్థినుల ప్రయాణ సమస్యను  ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిష్కరించారు.  వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ పట్టణం నుంచి తిమ్మాపూర్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయానికి అభివృద్ధి పనుల నిమిత్తం వెళ్తున్నారు. మార్గ మధ్యలో దుర్కి శివారులో గల ఎస్ఆర్ఎన్ కే  డిగ్రీ కళాశాల వద్ద  బాన్సువాడ - నిజామాబాద్ ప్రధాన  రహదారిపై బాన్సువాడ వైపు వెళ్లవలసిన బస్సు కోసం నిలబడి ఉన్న విద్యార్థినులను గమనించారు. తక్షణమే కారుని ఆపి ఎందుకు విద్యార్థినులు...