జనగణనలో పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం

0 9,889

 

. . . ప్రతి పౌరుడు నమోదు కావాలని పిలుపు

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ పట్టణం జనగణన కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బుధవారం పట్టణంలోని తన నివాసంలో జనగణన నమోదు ప్రక్రియలో పాల్గొన్నారు. జనగణన పోర్టల్ ద్వారా అధికారులు పోచారం కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరుడు జనగణనలో తప్పనిసరిగా పాల్గొని తమ వివరాలను నమోదు చేసుకోవాలని, జనగణన ద్వారా ప్రభుత్వానికి సమగ్ర సమాచారం లభించి అభివృద్ధి కార్యక్రమాల అమలుకు తోడ్పడుతుందని తెలిపారు.

. . . ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

జనగణన ముసుగులో కొందరు ఇళ్లలోకి వచ్చి వివరాలు సేకరించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. గణనకు వచ్చే వారు నిజమైన అధికారులేనా అని నిర్ధారించుకోవడం తప్పనిసరి అని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతి ఎన్యుమరేటర్కు ప్రత్యేక గుర్తింపు కార్డును జారీ చేసిందని, వివరాలు చెప్పే ముందు గుర్తింపు కార్డును తనిఖీ చేసి, వారు ధరించి ఉన్నారో లేదో చూడాలని అధికారులు సూచించారు.

Leave A Reply

Your email address will not be published.