- ఇరిగేషన్ మంత్రిని కోరిన రైతు సంక్షేమ కమిషన్
హైదరాబాద్, బతుకమ్మ : మైనర్ ఇరిగేషన్ ను మేజర్ ఇరిగేషన్ నుండి విడదీసి మైనర్ ఇరిగేషన్ శాఖను అభివృద్ధి చేయాలని రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్, సభ్యులు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరారు. రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, సభ్యులు గడుగు గంగాధర్, కేవీఎన్ రెడ్డి, భవాని రెడ్డి, చెవిటి వెంకన్నయాదవ్ శనివారం హైదరాబాద్ లోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. స్థానిక రైతులతో నీటి సంఘాలు ఏర్పాటు చేయాలని అన్నారు. నీటిపారుదల శాఖ మంత్రికి అగ్రికల్చర్ కమిషన్ సచివాలయంలో కలిసి మైనర్ ఇరిగేషన్ లోభాగమైన చెరువులు, కుంటలు పరిరక్షణకై కృషిచేయాలని కోరారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో మైనర్ ఇరిగేషన్ ను మేజర్ తో కలపడం వల్ల గ్రామాలల్లో చెరువులను ఆక్రమనకు గురయ్యాయని తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జాకు పాల్పడ్డారని అన్నారు. చట్టవిరుద్ధంగా చెరువుల్లోనే లే-అవుట్లు చేశారని పేర్కొన్నారు. అగ్రికల్చర్ ఫార్మర్ వెల్ ఫేయిర్ కమిషన్ ఏర్పడిన తర్వాత గ్రామాల్లోని చెరువుల నిర్వహణ భూగర్భ జలాలు పెరిగే విదంగా యాసంగి పంటకాలంలో కూడా బోర్ల ద్వారా వ్యవసాయం చేసుకునే అవకాశం ఉండేలా చూడాలని మంత్రిని కోరారు. త్వరలోనే నీటి సంఘాలను ఏర్పాటు చేసి, అధికారికంగా ప్రకటిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు.

