నిజామాబాద్, బతుకమ్మ – జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సోమవారం హాజరయ్యారు. అనంతరం ఎంఎల్ఏ లతో కలిసి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం జిల్లా సమీకృత కార్యాలయం లో నిర్వహించారు. అయితే ఈ సమీక్షా సమావేశం లో నగర ప్రథమ పౌరురాలు అయినా మేయర్ ను నిల్చోబెట్టి మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించడం పలు విమర్శలకు తావిస్తోంది. ఇది ముమ్మాటికీ ఒక మహిళా ప్రతినిధిని అవమానించడమే నని కొందరు విమర్శిస్తున్నారు.