29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

హాస్పిటల్ లో చేరిన ఎమ్మెల్సీ కవిత

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాస్పిటల్ లో చేరారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రిలో చేరిన ఎమ్మెల్సీ కవిత కు డాక్టర్లు నిర్వహిస్తున్న పరీక్షలు సాయంత్రానికీ పూర్తికానున్నాయి. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో తీహార్ జైలు లో ఉన్న సమయంలో ఎమ్మెల్సీ కవిత గైనిక్ సమస్యలు , తీవ్ర జ్వరంతో పలు సార్లు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గతంలో ఢిల్లీలో ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు నిర్వహించగా గైనిక్ సమస్యతో బాధపడుతున్నట్టు గుర్తించారు. అవే సమస్యలతో మరోసారి ఆసుపత్రిలో చేరారు. మరి కొన్ని రోజుల్లో బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అందులో పాల్గొంటారు లేదా అని ప్రచారం జరుగుతుంది. అలాంటి సమయంలో కవిత ఆసుపత్రి కి వైద్యం కోసం చేరడం పట్ల ఆమె అభిమానులు పార్టీ నాయకులు ఆమె రాక కోసం ఎదురుచూస్తున్నారు.

More articles

Latest article