27.3 C
Hyderabad
Friday, July 31, 2026

సీఎం రేవంత్ చిత్రపటానికి క్షీరాభిషేకం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, మాచారెడ్డి: మాచారెడ్డి మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గజ్యానాయక్ తండా లో రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎన్నికల హామీ మేరకు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను అమలు చేసిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నో దశాబ్దాల  బీసీల కల నెరవేర్చిన ఘనత  కాంగ్రెస్ పార్టీ కి దక్కింది. కుల గణన  చేపట్టి  బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు శాసనసభ లో ఆమోదం జరిగింది.  పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ అయ్యేందుకు కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తేవడానికి అఖిల పక్షానికి నాయకత్వం వహించే బాధ్యత ను సీఎం తీసుకోవడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో  నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్, మాచారెడ్డి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చెల్లాపురం రాజిరెడ్డి,  ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు బద్రి,  యూత్ కాంగ్రెస్ నాయకులు మహేష్, సంతోష్, లక్ష్మణ్, బన్సీలాల్, రోషన్, హుస్సేన్, సాదిక్, దేవేందర్ గౌడ్, భాస్కర్ గౌడ్, జగన్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article