26.2 C
Hyderabad
Monday, August 3, 2026

కుట్టుమిషన్ల పంపిణీలో మేరు కుల మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిసి కులాల మహిళలకు వంద శాతం సబ్సిడీ ద్వారా అందించే కుట్టుమిషన్లను కుల వృత్తిపై ఆధారపడిన మేర కుల మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ  టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు జిల్లా మేరు కుల సంఘం నాయకులు గురువారం వినతి పత్రం అందజేశారు. బీసీ  సంక్షేమ శాఖ ద్వారా నూతనంగా ప్రారంభిస్తున్న పథకంలో బీసీ మహిళలకు అందించే కుట్టుమిషన్లలో తమ  వృత్తిపై ఆధారపడిన వారికి కుట్టు మిషన్లు అందించాలని కోరగా మహేష్ కుమార్ గౌడ్ సానుకూలంగా స్పంచిందినట్లు తెలిపారు.

 

Meru caste women should be given first priority in the distribution of sewing missions.

 

అలాగే బీసీ సంక్షేమాధికారికి సైతం మేర కులస్తుల మహిళలు తమ జీవన ఆధారమైన టైలరింగ్ పని చేసే వారికి కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేరు సంఘం జిల్లా అధ్యక్షులు సోమ హన్మంత్ రావు, ఉపాధ్యక్షులు కొట్టురు చంద్రకాంత్, నగర అధ్యక్షులు వెన్ను దేవానంద్, ఉపాధ్యక్షులు పుట్టాకోట పాండు, ప్రధాన కార్యదర్శి దర్భస్తూ గంగాధర్, సంయుక్త కార్యదర్శి తాళ్ల శివకుమార్, , నాయకులు పోల్కం గంగాకిషన్, ఎన్ను సుదర్శన్, శ్రీరామ్ సందీప్, కొట్టుర్ శ్రీనివాస్, రుద్రంగి రఘు, గట్ల నరేందర్, గంగాదర్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

 

Meru caste women should be given first priority in the distribution of sewing missions.

More articles

Latest article