29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

నీట్ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

Must read

📰 Generate e-Paper Clip

 

డిచ్ పల్లి, బతుకమ్మ :

 

తెలంగాణ యూనివర్సిటీ లో మే 3న జరగనున్న నీట్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె కళాశాల పరీక్ష కేంద్రాన్ని కలియ తిరిగి కళాశాల అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకుని తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూడాలని, పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సాఫీగా జరిగే విధంగా చూడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జి.రాంబాబు, వైస్ ప్రిన్సిపాల్ డా.సి.హెచ్.లక్ష్మణ చక్రవర్తి, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

 

District Collector inspects NEET exam center

More articles

Latest article