. . . ఏసిబికి చిక్కిన ఫారేస్ట్ బీట్ ఆఫీసర్
భద్రాద్రి కోత్తగూడేం, బతుకమ్మ:
ప్రభుత్వం ఇచ్చిన పోడు పట్టాభూమిలో సాగు చేసుకోవాలంటే తనకు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసిన పారేస్ట్ బీట్ ఆఫీసర్ ఏసిబికి చిక్కారు. గురువారం భద్రాద్రి కొత్తగూడేం జిల్ల గుండాల రేంజ్ పరిధిలోని నడిమిగూడేం (సాయన్నపల్లి ఇంచార్జీ) ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోత్ నరేష్ ఓ రైతు నుంచి 10 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యండేడ్ గా పట్టుకున్నారు. గుండాల రేంజ్ పరిధిలోని వెంకటాపూర్ రెవెన్యూ గ్రామ శివారులో ఓ రైతుకు ప్రభుత్వం 5 ఎకరాల పోడు భూమికి పట్టా ఇచ్చింది. అక్కడ పంటల సాగులో తన జోక్యం ఉండకూడదు అంటే తనకు రూ.10 వేల లంచం ఇవ్వాలని ఫారేస్ట్ బీట్ ఆఫీసర్ నరేష్ డిమాండ్ చేశారు. భాధితుడు ఏసిబికి పిర్యాదు చేయడంతో అరెస్ట్ చేసి వరంగల్ ఏసిబి కోర్టులో హజరు పరిచారు.
