. . . డా.జలగం తిరుపతి రావు
డిచ్ పల్లి, బతుకమ్మ :
విద్యార్థులు ఆధునిక వైద్య, విజ్ఞాన రంగాలలో పరిశోధనలు చేయాలని, మానసిక ఆరోగ్య దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని డాక్టర్ జలగం తిరుపతి రావు అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మసిటికల్ కెమిస్ట్రీ నిర్వహిస్తున్న రెండో రోజు జాతీయ సదస్సు లో భాగంగా రెండో రోజు జరిగిన కార్యక్రమంలో నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల కు చెందిన డాక్టర్ జలగం తిరుపతిరావు మాట్లాడుతూ రోగుల వైద్య నిర్ధారణ, నివారణలో జీవ రసాయన శాస్త్రపరిశోధనలు ఒక మంచి వారధిగా పని చేస్తాయని తెలిపారు. కేంద్రం (డిఎన్ఏ) ఫింగర్ ప్రింటింగ్, డయాగొస్టిక్ పరిశోధన సంస్థ కి చెందిన డాక్టర్ దీపేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ పరిశోధన, వైద్యరంగంలో వస్తున్న నూతన వైజ్ఞానిక ఆవిష్కరణలను వివరించారు. వృక్షాలు, జంతువులలో జరిగే వివిధ జన్యూ ఉత్పత్తి వస్త్రాలు, పరిణామాల గురించి తెలియజేశారు. ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా రిజిస్ట్రార్ ఆచార్య ఎం.యాదగిరి మాట్లాడుతూ జీవ రసాయన శాస్త్రంలో నూతన ఆవిష్కరణ పరిశోధనలు జరుగుతున్నాయని, విద్యార్థులు పరిశోధనలపై దృష్టి సారించాలని తెలిపారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ రాంబాబు గోపిశెట్టి, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
