డాక్టర్ బాపురెడ్డికి నివాళులు అర్పించిన ఆఫీసర్ క్లబ్ కమిటీ సభ్యులు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రముఖ వైద్యులు, తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమకారుడు డాక్టర్ జె.బాపురెడ్డి మృతి జిల్లాకు తీరని లోటని తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్, నిజామాబాద్ అప్పీసర్స్ క్లబ్ ఉపాధ్యక్షుడు తాహెర్ బిన్ హంధాన్ అన్నారు. నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ లో సోమవారం నిర్వహించిన సంతాప సమావేశంలో బాపురెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. వైద్యుడుగా ఎంతోమందికి వైద్య సేవలు అందించి ప్రాణాలు పోసి జిల్లా ప్రజల మన్ననలు పొందారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర మలిదశ...