రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి
ఇందల్వాయి,బతుకమ్మ: ప్రభుత్వాన్ని విమర్శిస్తే సహించేది లేదని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి హెచ్చరించారు. మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం డ్రగ్ మాఫియాకు ఇప్పటికే లిక్కర్ స్కాంతో కల్వకుంట్ల కవిత తీహార్ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ మాఫియా జరుగుతున్నట్లు అందులో విజయ్ అనే వ్యక్తి రెడ్ హ్యాండుగా దొరికారన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి నిందలు వేస్తూ కక్షతరహాలు రైతులను రెచ్చగొట్టి ధర్నాలు చేయిస్తున్నారన్నారు.కేటీఆర్, హరీష్ రావు డ్రగ్స్ వంటి కార్యకలాపాలకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికే కాలేశ్వరం భూములు,ఫోన్ టాపింగులవంటివికి పాల్పడుతున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీకి అతి తొందర్లోనే తగిన బుద్ధి జరుగుతుందన్నారు. లిక్కర్ స్కాంలో కవిత జైలుకెళ్లిన విషయం మర్చిపోవద్దు అన్నారు. గతంలో మూసి బాధిత రైతులను నష్టపరిచడం జరిగిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో పాలించి ఒక ఫ్యామిలీ కుటుంబంగా మాఫియా వంటి దుచ్చర్వియాలకు పాల్పడిన ఘనత వారిదేనన్నారు.మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి గులాంగిరి చేస్తూ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎన్నికలలో డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోయిందని వాపోయారు. ఎంపీ ఎన్నికలలో దిగజారుడు వ్యక్తిగత కక్షలతో బిజెపితో అనుకూలంగా వల్లే కొన్ని సీట్లు గెలుచుకోవడం జరిగిందన్నారు.బీ ఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి 5000 కోట్లగా పైగా మిషన్ భగీరథలో అవినీతికి పాల్పడినట్లు తమ దగ్గర సమాచారం ఉందన్నారు.ఇప్పుడు బిజెపి నాయకులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు కొత్త తరహా వేషాలు వేసి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటేనని మళ్లీ తప్పుగా మాట్లాడుతున్నరు .టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో కెసిఆర్ ను జైలుకు పంపుతామన్న బిజెపి పార్టీ ఇప్పుడు కెసిఆర్ తో లోలోపాల సత్సంబాలు పెట్టుకొని వారి పైన ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా వారిని కాపాడడానికి చూస్తున్నారన్నారు.ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు సీఎం రేవంత్ రెడ్డి అన్ని హామీలను సక్రమంగా అమలు చేస్తున్నారని దీనిని ప్రజలందరూ గమనిస్తున్నారాన్నరు.అందుకే కాంగ్రెస్ పార్టీ పైన మంచి అభిప్రాయంతో సీనియర్ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరుగుతుందన్నారు.రానున్న కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఒంటరి ఫ్యామిలీ కుటుంబ పార్టీగా నిలబోతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో బీసీ కమిషన్ను వేసి బీసీ కుల గణనను జనాభా ప్రతిపాదికంగా రిజర్వేషన్ అమలు చేసే ప్రక్రియను కొనసాగించనున్నట్లు తెలిపారు. గతంలో పాలించిన పార్టీలు బిసి కమిటీలను ఇప్పటివరకు వేయకపోవడం జరిగిందన్నారు. బీసీ జనగణను నాలుగో తారీఖు నుండి చేయనున్నట్లు ఎమ్మెల్యే రేట్లపల్లి భూపతిరెడ్డి తెలిపారు. రైతులకు సన్న రకం వరి ధాన్యం కు 500 రూపాయల బోనస్ రేపటినుండే ట్రాన్స్ పోర్ట్ చేసి ఇవ్వనున్నట్లు తెలిపారు .రెండు లక్షల పైన ఉన్న రైతుల రుణం రుణమాఫీ కొరకు క్యాబినెట్ మీటింగ్ లో డిసెంబర్ 9వ తారీఖున చర్చించి ఎవరికైతే రెండు లక్షల పైన ఉన్నావారి కొరకు క్యాబినెట్ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు.. ఈ కార్యక్రమంలో ముప్ప మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్ , పిఎసిఎస్ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎంపీపీ ముత్తన్న, మచ్చ గోపాల్ ఇతర మండలాల సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, గంగారెడ్డి,సంతోష్ రెడ్డి,కిషన్ తదితరులు పాల్గొన్నారు.
Next Post