29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

మనోరమ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో వైద్యశిబిరం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  మోపాల్ మండల కేంద్రంలో మనోరమ హాస్పిటల్స్  ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్నిసోమవారం నిర్వహించారు.   ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ , సీనియర్ సిటిజన్స్ ఫోరం విలేజ్ డెవలప్మెంట్ కమిటీ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా  మల్లు స్వరాజ్యం ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ రవీంద్రనాథ్ సూరి  మాట్లాడారు.

Medical Camp under Manorama Hospitals

వృద్ధుల పట్ల సమాజం చిన్నచూపు చూడటం సరైనది కాదని, వృద్ధులకు ప్రభుత్వం అనేక హక్కులు ప్రభుత్వం కల్పించిందని అన్నారు. వారసులు అర్థం చేసుకొని వారి సంక్షేమం చూడాలని ఆయన అన్నారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ జిల్లా అధ్యక్షులు రామ్మోహన్రావు మాట్లాడుతూ వృద్ధుల అనుభవాన్ని వినియోగించుకున్న వారు అభివృద్ధి పథంలోకి వెళ్తారని ఇక్కడ వైద్య శిబిరం ఎంతో సంతృప్తిని కలిగించిందని ఆయన అన్నారు. సీనియర్ సిటిజన్స్ ఫోరం రాజా గౌడ్ మాట్లాడుతూ వృద్ధుల పట్ల శత వివక్షత ఉండకూడదని నిత్యం వారితో ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్ యూనియన్ నాయకులు మదన్మోహన్, ప్రసాద్ రావు, వీడిసి నాయకులు జనార్ధన్, గోవర్ధన్, నవీన్ రెడ్డ ,దమ్మడి గంగాధర్,  మనోరమ ఆసుపత్రి డాక్టర్లు శరన్ రాజేష్, శివాని, నేహా, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Medical Camp under Manorama Hospitals

More articles

Latest article