29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

డ్రగ్స్, గంజాయి నివారణపై ఉక్కు పాదం

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లాకు స్పెషల్ టీమ్స్
  • ప్రోహిబిషనరి అండ్ ఎక్స్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

బతుకమ్మ, భీమ్ గల్ : జిల్లాలో డ్రగ్స్, గంజాయి, అల్పరాజోలం లాంటి మత్తు పదర్థాలను సరఫరా చేసే వారిపై క్రిమినల్ కేసులు వేసి ఉక్కుపాదం మోపాలని ప్రొభి్షనరీ అండ్ ఎక్స్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. సోమవారం భీమ్ గల్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రోహిబిషనరీ అండ్ ఎక్స్సైజ్ ఆఫీస్ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాకు త్వరలోనే స్పెషల్ టీమ్స్ ను పంపిస్తామని ఎవ్వరిని వదలకుండా కఠిన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. స్టాఫ్ విషయంలో కొంత ఇబ్బంది ఉన్న మాట వాస్తవమేనని త్వరలో అందుకు కావాల్సిన చర్యలను చేపడుతామని అన్నారు. ఈ కార్యక్రమం లో రూరల్ ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్ హనుమంతు,డీసీసీ ప్రెసిడెంట్, స్టేట్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కన్నె ప్రేమలత సురేందర్,బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జీ ముత్యాల సునీల్ కుమార్,కాంగ్రెస్ మండల పార్టీ ప్రెసిడెంట్ బోదిరే స్వామి, నిజామాబాద్ ప్రోహిబిషనరి అండ్ ఎక్స్సైజ్ కమిషనర్ వి. సోమిరెడ్డి, డీపీఈవో కె. మల్లారెడ్డి, ఏ ఈ ఎస్ డీసీబీ నాయక్, భీమ్ గల్ ఎస్ యచ్ ఓ పి. వేణు మాధవరావు తదితరులు పాల్గొన్నారు.

Steel leg on drug, marijuana prevention

More articles

Latest article