28.8 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రమాదాల నివారణకు చర్యలు

Must read

📰 Generate e-Paper Clip

  • ‘బతుకమ్మ’తో భిక్కనూర్ ఎస్ఐ ఆంజనేయులు

 

భిక్కనూర్, బతుకమ్మ: భిక్కనూర్ ఎస్ఐ ఆంజనేయులు సోమవారం ‘బతుకమ్మ’తో ముచ్చటించారు. భిక్కనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు.

బతుకమ్మ: మండలంలో సీసీ కెమెరాలు చాలా చోట్ల పనిచేయడం లేదు… వాటి పునరుద్ధరణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

ఎస్సై:  సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. సీసీ కెమెరాలు ఏర్పాటుకు గ్రామస్తులు ముందుకు రావాలి.

బతుకమ్మ : రోడ్డు ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

ఎస్సై : ప్రతిరోజు వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నాం.. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ పై అవగాహన కల్పించి తప్పకుండా హెల్మెట్ ధరించే విధంగా కృషి చేస్తున్నాం. నిబంధనలు పాటించని వారికి జరిమానాలు విధించడం జరుగుతుంది.

More articles

Latest article