24.7 C
Hyderabad
Monday, August 3, 2026

జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • కలెక్టర్, జిల్లామెజిస్ట్రేట్ రాజీవ్ గాంధీ హనుమంతు

 

నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని కలెక్టర్, జిల్లామెజిస్ట్రేట్ రాజీవ్ గాంధీ హనుమంతు అధ్యక్షతన నిర్వహించినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి.రాజశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సమన్వయ సమావేశంలో పాల్గొన్న జిల్లా అధికారులందరూ ముఖ్యంగా జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా సంక్షేమ అధికారినీ , జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి, వివిధ సంక్షేమ శాఖల జిల్లా స్థాయి అధికారులు అందరూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారితో సమన్వయంగా ఉంటూ నులి పురుగుల నివారణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమాన్ని    ఫిబ్రవరి 10  వ తేదీన జిల్లా వ్యాప్తంగా 1 -19 సంవత్సరాల పిల్లలందరికీ  నులిపురుగుల నిర్మూలన కొరకు అల్బెన్దజోల్  మాత్రలు వేయడం  జరుగుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమం  అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో, ప్రభుత్వ,  ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో, సోషల్ వెల్ఫేర్ , బి.సి వెల్ఫేర్ , మైనారిటీ వెల్ఫేర్, కేజీబీవీ, మోడల్ పాఠశాలలు, కళాశాలల్లో, హాస్టల్స్ లో మతపరమైన పాఠశాలలు, కళాశాలల్లో ఈ  అల్బెన్దజోల్  మాత్రలు అందించబడుతుంది అని తెలియ జేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా అదనపు కలెక్టర్లు స్థానిక సంస్థలు అంకిత్, రెవిన్యూ కిరణ్ కుమార్, డి ఆర్ డి ఓ సాయ గౌడ్ , ఆర్డీవో రాజేంద్రకుమార్ , మెప్మా పీడీ రాజేందర్  జిల్లా ఇమ్మునైజేషన్ అధికారి డాక్టర్ అశోక్, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ లు డాక్టర్ రమేష్, డాక్టర్ రాజు, డీఎస్ఓ డాక్టర్ నాగరాజు, పిఓ డాక్టర్ వినీత్ , జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి బి నాగోరావు, విద్యాశాఖ నుండి విజయభాస్కర్,ఆర్.బి. స్.కె మేనేజర్ సచిన్, డి హెచ్ ఈ ఘన్ పూర్ వెంకటేశ్వర్లు, కోఆర్డినేటర్ వెంకటేశం, ఆర్.బి. స్.కె సిబ్బంది, పాల్గొన్నారు.

More articles

Latest article