24.7 C
Hyderabad

తడపాకల్ లో ఉపాధి హామీ కూలీల తో మేడే సంబరాలు

Must read

📰 Generate e-Paper Clip

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

ఏర్గట్ల మండలం తడపాకల్ గ్రామంలో ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఉపాధి హామీ కూలీలతో మే డే సంబరాలను తడపాకల్ గ్రామ సర్పంచ్ జింక స్వప్న అనిల్ కుమార్ ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ కార్మిక, కర్షకుల చెమట చుక్కలతోనే ప్రభుత్వాలు నడుస్తున్నాయని స్వాతంత్రం రాకముందు జరిగిన శ్రమ దోపిడీ తరువాత స్వాతంత్ర భారత దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు అండగా ఎన్నో కార్మిక చట్టాలను తీసుకొచ్చిందన్నారు. నాటినుండి నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం వరకు కార్మిక కర్షక లోకానికి కాంగ్రెస్ ప్రభుత్వాలు అండగా ఉంటున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తడపాకల్ ఉప సర్పంచ్ లోలపు రాజు, పంచాయితీ కార్యదర్శి రాకేష్, ఫీల్డ్ అసిస్టెంట్ అనిల్, పంచాయితీ కారోబార్ హన్మండ్లు, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు మేడే సంబరాలు ఘనంగా నిర్వహించారు.

More articles

Latest article