Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 December 2024, 11:23 am Posted by : ramakrishna

తెలంగాణ – చత్తీస్గడ్ సరిహద్దులో భారీ ఎన్కౌంటర్

. . . 8 మంది మావోయిస్టుల మృతి ?

. . .   భారీగా అయుదాలు స్వాధినం

ములుగు, బతుకమ్మ:

పిఎల్జిఏ వారోత్సవాలకు ఒక రోజు ముందు తెలంగాణలో ఎదురు కాల్పుల ఘటన చోటు చేసుకుంది. తెలంగాణ- చత్తీస్ ఘడ్ సరిహద్ధులో అదివారం తెల్లవారు జామున బారీ ఎన్ కౌంటర్ జరిగింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చలపాక సమీపంలో ఈ ఘటన  జరిగినట్లు సమాచారం…

 

Massive encounter on Telangana-Chhattisgarh border ఈ ఎదురు కాల్పుల ఘటనలో 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు గా చెప్తున్నారు. ఈ ఎన్ కౌంటర్ లో కుర్సం మంగు అలియాస్ భద్రు , అలియాస్  పాపన్న (టిఎస్ సియం సెక్రటరీ యెల్లందు – నర్సంపేట) గా  చెబుతున్నారు. ఈగోలపు మల్లయ్య అలియాస్ మధు (డివిసియం కార్యదర్శి ఏటూరునాగారం మహదేవ్‌పూర్ ఏసీ), ముస్సాకి దేవల్ అలియాస్ కరుణాకర్ (ఎసియం) , ముస్సాకి జమున (ఎసియం),  మావోయిస్టు ధళ సభ్యులు జైసింగ్ , కిషోర్, కామేష్ లు ఈ ఎన్ కౌంటర్ లో చనిపోయినట్లు సమాచారం. మరోకరిని గుర్తించాల్సి ఉంది. పూర్తి వివరాలు తెలియాలని వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. ఈ ఎన్ కౌంటర్ లో రెండు ఎకే 47 రైపిల్స్ తో పాటు బారీగా అయుదాలు స్వాధినం చేసుకున్నారు.

Massive encounter on Telangana-Chhattisgarh border