25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

బిచ్కుందలో సామూహిక వందేమాతర గీతాలాపన

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బిచ్కుంద : శుక్రవారం వందేమాతరం గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలోబిచ్కుంద ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వందేమాతరం గీతాలాపన కార్యక్రమంలో  ఎక్సైజ్ సీఐ సత్యనారాయణతో కలిసి ఎక్సైజ్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా  ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయులకు స్పూర్తి నింపిన వందేమాతరం గేయానికి నేటీతో 150 ఏళ్లు పూర్తయ్యాయని తెలిపారు. వందేమాతరం గేయంలోని ప్రతి పదం దేశభక్తి భావనతో నిండి, భారతదేశం ఒకటే అని గర్వంగా చెబుతుందని అన్నారు. ఈ గీతం మన దేశ ఐక్యత, సౌభ్రాతృత్వానికి ప్రతీక అని, ప్రతి ఒక్కరూ ఈ భావనను మనసులో నిలుపుకోవాలని తెలిపారు. వందేమాతరం గేయం ప్రతి పౌరుడిలో దేశభక్తి భావాన్ని పెంపొందిస్తుందని, దేశ చరిత్రలో ఈ గేయం విశేష ప్రాధాన్యత కలిగి ఉందని  ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ అన్నారు

More articles

Latest article