రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలానికి చెందిన ఎం. గోపాల్ తన మొబైల్ ఫోన్ ను పోగొట్టుకోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, ఈ మేరకు పోలీసులు సిఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్ ను కనుగొని శుక్రవారం ఎస్సై సాయన్న పోలీస్ స్టేషన్ లో బాధితునికి తిరిగి ఫోన్ ను అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన ఎస్ఐ, పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.