27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ఏసీబీకి చిక్కిన మరిపెడ ఏఈవో

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ : రైతు బీమా ఫైల్ క్లియర్ చేయడం లంచం డిమాండ్ చేసిన మండల వ్యవసాయ విస్తరణాధికారి (AEO) ఏసీబీ కి చిక్కాడు.  జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మరిపెడ మండల వ్యవసాయ విస్తరణాధికారిగా (AEO) సందీప్ పని చేస్తున్నాడు.  రైతు బీమా ఫైల్‌కు సంబంధించి ఓ రైతు నుంచి రూ.10,000 లంచంను సందీప్  డిమాండ్ చేశాడు. బాధిత రైతు ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. గురువారం బాధిత  రైతు నుంచి సందీప్ లంచం తీసుకుంటుగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెండ్ గా పట్టుకున్నారు. సందీప్ ను అదుపులోకి తీసుకొని  ఏసీబీ అధికారులు విచారణ చేపడుతున్నారు. ఈఘటన స్థానిక వ్యవసాయ కార్యాలయంలో సంచలనం రేపింది.

More articles

Latest article