వెబ్ న్యూస్, బతుకమ్మ : అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మంగళవారం ఉదయం ఎదురుకాల్పలు జరిగాయి. ఈఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత, మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు, కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా, ఆయన భార్య రాజీ అనుచరులు ఉన్నారు. మంగళవారం ఉదయం 6గంటల నుంచి ఆప్రాంతోం భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. కాగా హిడ్మాపై రూ.కోటి, ఆయన భార్యపై రూ. 50 లక్షల రివార్డు ఉంది.
ఛత్తీస్ గడ్ లోనూ..
మరోవైపు ఛత్తీస్ గడ్ లోని సుక్మా జిల్లాలోను ఎదురు కాల్పులు జరిగాయి. మంగళవారంఉదయం ఎర్రబోరు ప్రాంతంలో మావోయిస్టు భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్లు జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు.
