నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గ్లోబల్ అయోడిన్ లోప అనర్ధాల నివారణ దినోత్సవం పురస్కరించుకొని సోమవారం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలైన అర్సపల్లి మాలపల్లి లో అయోడిన్ లోపా అనర్ధాలపై అవగాహన కల్పించడం జరిగిందని ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణ ఆరోగ్య కేంద్రం అర్సపల్లిలో మాట్లాడుతూ అయోడిన్ లోపం ద్వారా థైరాయిడ్ గ్రంధి నుండి థైరాక్సిన్ హార్మోను విడుదల తగ్గడం ద్వారా అనేక అనర్ధాలు పిల్లలు, మహిళలు యువకులు వయో జనులలో వయసులవారీగా వివిధ రూపాల్లో కనిపించునని , ముఖ్యంగా పిల్లల్లో జ్ఞాపకశక్తి గ్రహణ శక్తి లోపించడం శారీరక మానసిక ఎదుగుదల తగ్గిపోవడం, మెదడు ఎదుగుదల లేకపోవడంతో పిల్లలు మానసిక వైకల్యమునకు గురైయ్యే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా మహిళల్లో తరచుగా గర్భవిచ్చితి జరగడం, పిండం ఎదుగుదల సరిగా లేక తక్కువ బరువుతో శిశువులు జన్మించడం, మృత శిశువు జననం, అవయవ లోపాలతో జన్మించడం, గాయిటర్, గొంతులో వాపు,నీరసం, బలహీనత, హారుమోన్ల అసమతుల్యం, వెంట్రుకలు రాలిపోవడం లాంటి అనేక అనర్ధాలు మహిళల్లో పిల్లల్లో సంభవిస్తాయని తెలిపారు. అదేవిధంగా పట్టణ ఆరోగ్య కేంద్రం మాలపల్లిని సందర్శించి ప్రభుత్వ పాఠశాలలోని వంటశాలను, అంగన్వాడీ కేంద్రాన్ని వారు వాడుతున్నటువంటి అయోడైజ్డ్ సాల్ట్ ను పరీక్షించడంతోపాటు వంటగదిశుభ్రత ఐయో డిన్ ఉప్పు వాడుక విధానము జాగ్రత్తలపై వంట మనుషులకు, ఆయాలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అజ్మతున్నేసా బేగం, డాక్టర్ గంగా దినేష్ , ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు ఫాజల్ జిల్లా ఆరోగ్య విద్యా బోధకులు ఘన్పూర్ వెంకటేశ్వర్లు, శశికళ, కవిత , ఆశా కార్యకర్తలు ఏఎన్ఎo లు, గర్భిణీ స్త్రీలు, మహిళలు పాల్గొన్నారు.
