బతుకమ్మ భిక్కనూరు: భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న డిజిటల్ సభ్యత నమోదు కార్యక్రమాన్ని సోమవారం మండల అధ్యక్షులు ఉప్పరి రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటింటికి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు అరిగే నర్సింలు రామచంద్రం ఆనంద్ బోయిని హరీష్ తదితరులు పాల్గొన్నారు.